మిత్రుని కుటుంబాన్ని ఆదుకున్న తోటి మిత్రులు

మిత్రుని కుటుంబాన్ని ఆదుకున్న తోటి మిత్రులు

చౌటుప్పల్. మన స్సాక్షి.

ఆకస్మికంగా మృతి చెందిన సాటి డ్రైవర్ కుటుంబాన్ని చౌటుప్పల్ మినీ గూడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంగు లక్ష్మయ్య, ఉపాధ్యక్షుడు ఎన్ స్వామి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులంతా కలిసి తోటి డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబాన్ని ఆదుకున్నారు.

 

ALSO READ : Minister Sabitha : మంత్రి సబితమ్మకు ఘోర పరాభవం

 

చౌటుప్పల్ పట్టణ ప్రాంతానికి చెందిన బడే లింగస్వామి ఇటీవల అనారోగ్య కారణంతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న మినీ గూడ్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి దయార్థ హృదయంతో స్పందించి వారి కుటుంబాన్ని పరామర్శించి 65,700 రూపాయలను మృతుడి భార్య పిల్లలకు సోమవారం అందించారు.

 

ALSO READ : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

 

అనంతరం ఆ డబ్బులు భార్య పిల్లలు పేరుమీద బ్యాంకులో పిక్స్ డిపాజిట్ చేసినట్లు వారు తెలిపారు. తోటి డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన తీరును గ్రామస్తులు, పెద్దలు అభినందించారు. భవిష్యత్ తరాల వారికి నిజమైన మిత్రులు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు.