వలిగొండ : గాలి దుమారం

వలిగొండ : గాలి దుమారం

వలిగొండ , మన సాక్షి:

వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో వాయు మరియు వరుణ దేవుడు నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా గాలి దుమారం రావడంతో చెట్ల కొమ్మలు విరిగిపడినవి. మొన్న రెడ్ల రేపాక, నిన్న వెలువర్తి ఈరోజు పులిగిల్ల గ్రామాలను గాలి వాన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.

 

అదేవిధంగా రేకులు కలిగి ఉన్న ఇండ్లకు కప్పులు లేచిపోవడం జరిగింది. దీనితో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోతున్నాయి. ఈ గాలి దేవునికి పేదల ఇండ్లకు నష్టం కలిగించాలని కోరిక కలుగుతుందా. ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం వచ్చేసరికి కరెంటు స్తంభాలు నేలకోరిగాయి.

 

ALSO READ : ATM CARD | ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా .. బ్యాంకు కొత్త సర్వీస్.. ఎలా చేయాలో తెలుసుకుందాం..!

 

చెట్ల కొమ్మలు విరిగిపడి పలు వాహనాలు పాక్షికంగా ధ్వంసమైనాయి. పల్లేర్ల బిక్షపతి కి చెందిన మేకలు చెట్టు కింద ఉండడంతో కొమ్మ విరిగి పడడంతో ఒక మేక చనిపోయింది. సంగపాక నరసింహ ఇల్లు రేకులకప్పు లేచిపోయింది. ఎస్సీ కాలనీలో ని పలువురి ఇండ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో పాక్షికంగా కొన్ని ఇళ్లు ధ్వంసమైనాయి.

 

దుర్గమ్మ గుడి వద్ద పెద్ద చెట్టు విరిగిపడి మెయిన్ లైన్ మీద పడడంతో విద్యుత్తు కి అంతరాయం ఏర్పడింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భయంకరమైన గాలులు వీయడంతో గ్రామం అంతా అతలాకుతలమైంది. నష్టపోయిన వారికి అధికారులు స్పందించి పరిహారం చెల్లించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.