యువత క్రీడా రంగంలో రాణించాలి – ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

యువత క్రీడా రంగంలో రాణించాలి 

జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మజీద్ మామిడిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న 3 వ జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు.

క్రీడకారులతో కొద్దిసేపు ఆడి క్రీడాకారులను ఉత్సహపరిచారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ…

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు, క్రీడలతో శారీరిక, మానసిక ఉల్లాసం, స్నేహాభావం పెంపొందుతుందని అన్నారు, అనంతరం అప్పరెడ్డిగూడ గ్రామానికి చెందిన ఎన్. రాంగోపాల్ కి రూ. 48,000/- విలువగల సీ.ఎం సహాయనిధి చెక్కు అందజేశారు.