Ganesh : గణేశ్ నిమర్జనములో సిసి కెమెరాలు, వీడియోగ్రఫీ ఏర్పాటు..!

గణేశ్ నిమర్జనమునకు పకడ్బందీ చర్యలను చేపట్టామని, అందరూ ప్రశాంత నిమర్జనమునకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. ధర్మపురి పట్టణo ,రాయపట్నం లో గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గంలను నిమర్జనం జరిగే గోదావరి ప్రాంతాలను పరిశీలించారు.

Ganesh : గణేశ్ నిమర్జనములో సిసి కెమెరాలు, వీడియోగ్రఫీ ఏర్పాటు..!

జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్

జగిత్యాల ప్రతినిధి,(మన సాక్షి)

గణేశ్ నిమర్జనమునకు పకడ్బందీ చర్యలను చేపట్టామని, అందరూ ప్రశాంత నిమర్జనమునకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. ధర్మపురి పట్టణo ,రాయపట్నం లో గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గంలను నిమర్జనం జరిగే గోదావరి ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమర్జనం పూర్తి అయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. నిమర్జనం అంతయు ప్రశాంత వాతావరణం లో పూర్తి అయ్యేలా భద్రత పరమైన అన్ని చర్యలను చేపట్టామని తెలిపారు.

అవసరమైన ప్రాంతాలలో సిసి కెమెరాలను, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, స్థానిక గజ ఈతగాళ్లు ను నిమర్జన ప్రాంతములో అందుబాటులో ఉంచమని, శోభాయాత్ర వెళ్ళేమార్గo లో ఇతర శాఖ ల యొక్క సమన్వయము తో ఎటువంటి అవాంతరములు తలెత్తకుండా పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు.

నిమజ్జనం సందర్భంగా డీజే లు, సౌండ్ సిస్టంలు,బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని తెలిపారు. వినాయక నిమజ్జను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు.

అనంతరo రాబోవు అసెంబ్లీ ఎలక్షన్ లకు సంబంధించి రాయపట్నం వద్ద ఏర్పాటు చేయాల్సిన చెక్ పోస్ట్ ను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ వెంట మున్సిపల్ చైర్పర్సన్ సత్తమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, కమిషనర్ రమేష్, సి.ఐ రమణమూర్తి, ఎస్సై దత్తాత్రి,తహసీల్దార్ కృష్ణ చైతన్య ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు :