Suryapet : ఎండి పోయిన బోరు నుండి ఎగిసిపడుతున్న గంగమ్మ.. (వీడియో)

Suryapet : ఎండి పోయిన బోరు నుండి ఎగిసిపడుతున్న గంగమ్మ.. (వీడియో)
సూర్యాపేట రూరల్, మనసాక్షి
పంట సాగు కోసం ఐదు సంవత్సరాల క్రితం వేసిన బోరు కొద్ది పాటి సాగు నీరు కొంత కాలం పాటు అందించినప్పటికి కొద్ది రోజుల వ్యవధిలోనే పూర్తిగా ఎండి పోయింది. ప్రస్తుతం అదే బోరు బావి నుండి గత మూడు రోజులుగా నీరు ఉబికి బోరు నుండి ఆగకుండా బయటకు వస్తుంది.
ఈ ఘటన సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల గ్రామ శివారులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలెంల గ్రామ శివారులో ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మారేపల్లి ప్రభాకర్ కు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నీటి సౌకర్యం లేకపోవడంతో ఐదు సంవ త్సరాల క్రితం గ్రామానికి చెందిన గ్రామ మాజీ సర్పంచ్ పులగం స్వాతి రాఘవరెడ్డికి చెందిన శ్రీ సమ్మక్క బోర్వెల్ బండితో సుమారు 350 ఫీట్ల లోతు బోర్ వేయించడం జరిగింది.
అయినప్పటికీ కొద్దిపాటి నీరు లభ్యత కావడంతో ఉన్న నీటితో పంట సాగు చేసేందుకు మోటర్ బిగించి సేధ్యం మొదలు పెట్టాడు. కొద్దిపాటి నీరు కొంతకాలం పోసినప్పటికి తర్వాత పూర్తిగా ఎండిపోయింది. పూర్తిగా ఎండిపోయిన బోరు బావి నుండి గత మూడు రోజులుగా నీరు పైకి ఊబికి వస్తూ పుష్కలంగా పంట పొలానికి నీరు అందిస్తుండడంతో గ్రామస్తులు, రైతులు ఆశ్చర్యపోతున్నారు.
వీడియో
ఎండి పోయిన బోరు నుండి
ఎగిసిపడుతున్న గంగమ్మబాలెంల గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో
అరుదైన ఈ ఘటన pic.twitter.com/fcXZYt2Ocx— Mana Sakshi (@ManaSakshiNews) February 10, 2025
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల.. రెండు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో జమ.. బిగ్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. వారికి రైతుభరోసా కట్..!
-
District SP : విదేశాల్లో ఉండి రాకెట్.. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇండ్లకు కొత్త నిబంధనలు.. లేటెస్ట్ అప్డేట్..!









