గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం బహుకరణ..!
నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన కర్నాటి సోమయ్య–అరుణ దంపతులు గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని బహుకరణ చేశారు.

గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం బహుకరణ..!
వేములపల్లి, మన సాక్షి:
నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన కర్నాటి సోమయ్య–అరుణ దంపతులు గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని బహుకరణ చేశారు. ఈ సందర్భంగా కర్నాటి సోమయ్య మాట్లాడుతూ..పెద్దలు చెప్పినట్లుగా బతికినన్నాళ్లు ఎలా బతికినా, మరణించిన తర్వాత గౌరవప్రదమైన అంతిమయాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఈ రథాన్ని గ్రామానికి బహుకరిస్తున్నట్లు తెలిపారు.
గ్రామ పంచాయతీ సభ్యులు ఈ విరాళానికి గాను దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. వైకుంఠ రథాన్ని నిరంతరం సంరక్షిస్తూ, గ్రామ ప్రజలందరికీ అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచాలని పంచాయతీ నిర్ణయించినట్లు తెలిపారు.ఈ రథం గ్రామానికి ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.అనంతరం గ్రామ సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య, ఉపసర్పంచ్ గోవర్ధన్ సోమయ్య–అరుణ దంపతులను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రయ్య, మాజీ సర్పంచ్ దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి వైకుంఠ రథాన్ని బహూకరించడం అభినందనీయమని అన్నారు. వయస్సు మళ్లడంతో అంతిమయాత్రలో చివరి వరకు నడవలేని పెద్దలకు ఈ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
మాజీ ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పుట్టిపెరిగి ఉద్యోగరీత్యా పట్టణాల్లో ఆర్థికంగా వారు ముందుకు వచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు మాజీ ఉప సర్పంచ్ తరి సైదులు, మర్రి ఆనందం, వారి కుమారులు కర్నాటి రవి, రాఘవేంద్ర, గ్రామ పెద్దలు కందుల పెద్ద నాగిరెడ్డి, నల్ల మేకల నరసయ్య, దొంతిరెడ్డి చంద్రారెడ్డి, తరికోప్పుల వెంకటేశ్వర్లు, వంగాల సంజీవ చారి, అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి, జిన్నా వెంకట్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










