Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : రూ.30 లక్షల వ్యయంతో హెల్త్ ఎటిఎం.. ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి..!

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హెల్త్ ఎటిఎం – ప్రైమ్ టేర్ మిషన్, ఈసీజీ మిషన్‌ను. రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రారంభించారు.

Nalgonda : రూ.30 లక్షల వ్యయంతో హెల్త్ ఎటిఎం.. ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి..!

నల్లగొండ, మనసాక్షి :

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను సులభంగా, వేగంగా అందించాలనే లక్ష్యంతో రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హెల్త్ ఎటిఎం – ప్రైమ్ టేర్ మిషన్, ఈసీజీ మిషన్‌ను. రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచే ఆధునిక నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ఖరీదైన ఆసుపత్రులకు వెళ్లకుండానే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.

ఈ హెల్త్ ఎటిఎంలో ఈసీజీ, బీపీ, బ్లడ్ షుగర్, పల్స్, బాడీ టెంపరేచర్, ఆక్సిజన్ సాచ్యురేషన్ వంటి పరీక్షలు తక్కువ సమయంలో నిర్వహించవచ్చని తెలిపారు. పరీక్షల ఫలితాలు డిజిటల్ రూపంలో వెంటనే లభించడం వల్ల వైద్యులు సరైన చికిత్స సూచించేందుకు సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు.
గ్లూకోమియా కంటి పరీక్ష ఈ కంటి పరీక్షలు చేస్తారు కంటి విభాగంలో వచ్చే సమస్యలను రెట్టిన దెబ్బతిందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు

ప్రైమ్ టేర్ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సదుపాయాలు ప్రివెంటివ్ హెల్త్ కేర్ను బలోపేతం చేస్తాయని, హృదయ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడంలో ఈసీజీ మిషన్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వివరించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఇటువంటి హెల్త్ ఎటిఎంలను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ రెవిన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ స్థానిక సంస్థల ఇంచార్జ్ కలెక్టర్ వై అశోక్ రెడ్డి సూపర్డెంట్ నేత నరసింహారావు ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, స్థానిక అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ 

  1. TG News : మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల, రేపటి నుంచి నామినేషన్లు..!

  2. Nalgonda : పీపుల్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్, ఆవిర్భావం..!

  3. Groundnuts : వేరుశనగకు రికార్డ్ స్థాయి ధర.. రైతులను సన్మానించిన మార్కెట్ కమిటీ..!

  4. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

మరిన్ని వార్తలు