Miryalaguda : విద్యావంతుడిని.. ఒక్క అవకాశం ఇవ్వండి..!
Miryalaguda : విద్యావంతుడిని.. ఒక్క అవకాశం ఇవ్వండి..!
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి
మిర్యాలగూడ, మన సాక్షి :
తాను విద్యావంతుడినని ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కోరారు.
మంగళవారం వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డి తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎన్‌ఎస్‌పీ క్యాంప్ మైదానంలో, తెలంగాణ రాష్ట్ర ఫుడ్స్ మాజీ ఛైర్మన్ మేడే రాజీవ్ సాగర్, నియోజకవర్గ యువనేత నల్లమోతు సిద్ధార్థ తో కలిసి మార్నింగ్ వాక్ లో పాల్గొని వాకర్స్ ను వ్యక్తిగతంగా కలిసి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అనంతరం రెడ్డికాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు మాజీ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ తనను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మెడలు వంచి పట్టభద్రులకు మేలు చేకూర్చుతానని అన్నారు.
సాయంత్రం 4గంటలకు పట్టణంలోని రామచంద్రగూడెం, ఎస్వి గార్డెన్స్ నందు నిర్వహించనున్న పట్టభద్రుల సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కేటీ ఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎం.పీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొననున్నారు అన్నారు. ఇట్టి సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జొన్నలగడ్డ రంగారెడ్డి, గంట శ్రావణ్ రెడ్డి, పశ్య శ్రీనివాస్ రెడ్డి, షో యాబ్, విష్ణు, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
KTR : కేటీఆర్ ట్విట్టర్ లో కాంగ్రెస్ భరోసా కార్డు.. ఎందుకు పోస్ట్ చేశాడబ్బా.. తెలుసుకుందాం..!
Gpay : గూగుల్ పే వినియోగదారులకు షాక్.. ఆ సేవలు ఇక బంద్.. ఎప్పటినుంచో తెలుసుకుందాం..!
Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!










