సూర్యాపేట : కన్నుల పండువగా శ్రీ గోదా శ్రీనివాస కళ్యాణం

సూర్యాపేట : కన్నుల పండువగా శ్రీ గోదా శ్రీనివాస కళ్యాణం

– పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు

కుటుంభ సమేతంగా పాల్గొని అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి – సునీత దంపతులు

అన్నీ తామై గోదా శ్రీనివాస కళ్యాోత్సవం జరిపించిన మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు

సూర్యాపేట, మన సాక్షి:

ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్బంగా శనివారం సూర్యాపేట లోని వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలోని మైదానంలో శ్రీ గోదా దేవి శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు.

ఆభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించిన శ్రీ గోదాదేవి శ్రీ శ్రీనివాస స్వామి వారికి కంకణాలు కట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం అర్చకులు శ్రీ గోదాదేవి రచించిన 10 పాశురాలను పఠిస్తూ, వారణ మాయిరం క్రతువు నిర్వహించారు. చివరగా నివేదన, మంగళ హారతితో కళ్యాణ వేడుక ముగిసింది.

సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు కుటుంభ సమేతంగా కళ్యాణ వేడుకలో పాల్గొని అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించి అన్నీ తామై గోదా శ్రీనివాస కళ్యాోత్సవం జరిపించారు.