TOP STORIESBreaking Newsఆంధ్రప్రదేశ్వ్యవసాయం

Good News : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్.. ఆ రోజే రైతుల ఖాతాలలో డబ్బులు జమ..!

Good News : రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ డేట్ ఫిక్స్.. ఆ రోజే రైతుల ఖాతాలలో డబ్బులు జమ..!

మన సాక్షి, అమరావతి :

రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ విషయంపై గురువారం అన్నదాత సుఖీభవ అమలుకు సంబంధించి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం కూడా చేశారు.

అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2వ తేదీన ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే రోజున పిఎం కిసాన్ పథకం నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 20వ విడత 2000 రూపాయలతో పాటు రాష్ట్రం అన్నదాత సుఖీభవ ద్వారా 5000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడానికి సిద్ధమైంది.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి ప్రతి రైతుకు 14 వేల రూపాయలను అందిస్తుండగా పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు విడుదలుగా 6000 రూపాయలను అందిస్తుంది. రెండు పథకాలకు సంబంధించిన కూడా ఆగస్టు 2వ తేదీన నిధులు విడుదల చేసి రైతు ఖాతాలో జమ కానున్నాయి.

రాష్ట్రంలో 46, 85,858 మంది రైతులకు అన్నదాత సుఖీభవ లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. అందుకుగాను 2342.92 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆగస్టు 2వ తేదీన ప్రకాశం జిల్లా దర్శి లో అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

MOST READ : 

  1. Nalgonda : మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో సంచలనమైన తీర్పు..!

  2. Nalgonda : మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో సంచలనమైన తీర్పు..!

  3. Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)

  4. Job Mela : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. పదవ తరగతి ఆపై అర్హతల వారికి మెగా జాబ్ మేళా..!

మరిన్ని వార్తలు