Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. అందరికీ మాఫీ.. డేట్ ఫిక్స్..!
Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. అందరికీ మాఫీ.. డేట్ ఫిక్స్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించారు. మూడు విడతలుగా ఆగస్టు 15వ తేదీ నాటికి రెండు లక్షల రుణమాఫీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మంది రైతు కుటుంబాలకు 18 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది. కాగా సాంకేతిక కారణాల వల్ల రైతులందరికీ రుణమాఫీ కాలేదు. దాంతో ప్రభుత్వం ఆ రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించింది.
రుణమాఫీ కానీ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి వ్యవసాయాధికారులచే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు ఇంటింటికి వెళ్లి కుటుంబ సర్వే నిర్వహించారు. కుటుంబ సర్వేలో ఫ్యామిలీ ఫోటోలు కూడా అప్లోడ్ చేశారు. దాంతో మరో ఐదు లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా నిర్ణయించారు.
వారికోసం మరో 5 వేల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారం సిద్ధమైంది. ఇదిలా ఉండగా రెండు లక్షల రూపాయలకు పైగా బ్యాంకులలో రుణం ఉన్న వారికి కూడా మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.
డిసెంబర్ 9వ తేదీ వరకు రాష్ట్రంలోని రుణమాఫీ పూర్తిగా చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 9వ తేదీలోగా రైతులందరికీ రుణమాఫీ కానున్నది.
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించే ఉత్సవాలలో రైతులు కూడా సంతోషంగా పాల్గొనాలని ఉద్దేశంతో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేయనున్నారు.
MOST READ :
-
Damodara Rajanarsimha : కూత పెట్టిన మంత్రి రాజనర్సింహ.. కేరింతలు..!
-
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ లో ముగిసిన చిరుమర్తి విచారణ.. రెండు నెంబర్లు ఇచ్చాను..!
-
Gold Price : పసిడి ప్రియులకు మరింత ఆనందం.. దిగివచ్చిన బంగారం ధరలు..!
-
Miryalaguda : మిర్యాలగూడ మార్కెట్ కమిటీకి వేళాయె.. రాష్ట్రవ్యాప్తంగా 113 పూర్తి..!









