Good News : రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రేపే ఖాతాలోకి డబ్బు..!
Good News : రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రేపే ఖాతాలోకి డబ్బు..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త తెలియజేయనున్నారు. మహబూబ్నగర్ లో రైతు పండగ సందర్భంగా గుడ్ న్యూస్ తెలియజేసి రైతుల ఖాతాలలోకి డబ్బులు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల కోట్ల రూపాయలతో రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రభుత్వం చేసింది.
కాగా కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదు. అలాంటి రైతులకు నుంచి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వ్యవసాయ అధికారులు అర్హులైన రైతులను గుర్తించడానికి ఇంటింటికి సర్వే నిర్వహించి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు.
కాగా అర్హులైన రైతులందరికీ తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే పేర్కొన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రుణమాఫీ కానీ రైతులకు రైతు పండుగ సందర్భంగా శుభవార్త తెలియజేయనున్నారు.
4 లక్షల మంది రైతులకు 3000 కోట్ల రూపాయలను రుణమాఫీకి ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్నది. రైతులకు వారి వారి ఖాతాలలో నవంబర్ 30వ తేదీన జమకానున్నాయి.
MOST READ :









