TOP STORIESతెలంగాణ

TG News : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరో నూతన పథకం ప్రారంభం..!

తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. సంక్రాంతి పండుగకు మరో నూతన పథకాన్ని ప్రారంభించనున్నారు.

TG News : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరో నూతన పథకం ప్రారంభం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. సంక్రాంతి పండుగకు మరో నూతన పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నూతన పథకం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రారంభించనున్నారు. విద్యార్థులకు 22 వస్తువులతో కలిపి విద్యా కిట్ ను అందజేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాబోయే విద్యా సంవత్సరం నుంచి విద్యా కిట్ అందించనున్నారు. ఈ పథకాన్ని సంక్రాంతి కనుక గా ప్రారంభిస్తున్నప్పటికీ రాబోయే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రతి విద్యార్థికి విద్యా కిట్ అందించనున్నారు. వేసవి సెలవుల్లో ప్రతి పాఠశాలకు విద్య కిట్టును అందజేసి.. పాఠశాలలు ప్రారంభం కాగానే ప్రతి విద్యార్థికి అందించనున్నారు.

విద్యా కిట్ లో ఏమేమి ఉంటాయి :

విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే విద్యా కిట్ లో స్కూల్ యూనిఫామ్స్, షూస్, బుక్స్, టై, వాటర్ బాటిల్, కంపాక్స్ ఇలా అవసరమైన 22 వస్తువులతో కిట్టును అందజేయనున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుపరిచేందుకు విద్యా కిట్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

MOST READ 

  1. Suryapet : సూర్యాపేటలో క్రీడా ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

  2. TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!

  3. TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!

  4. Hyderabad : కట్ట మైసమ్మ గుడి ఘటనతో నేరేడ్ మెట్ లో ఉద్రిక్తత..!

  5. జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు