TOP STORIESBreaking News

TG News : నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు..!

TG News : నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది. అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. ఉగాది మరో వారం రోజుల్లో ఉంది. అయితే నిరుద్యోగులకు తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా శుభవార్త ప్రభుత్వం చెప్పబోతోంది.

మొత్తం 61, 579 పోస్టుల జాబితాను సిద్ధం చేసింది. అయితే ఉగాది పండుగ నాటికి 55,418 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. 2023లో డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు 58,868 పోస్టులను భర్తీచేసింది. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల తో పాటు 57,924 పోస్టులు భర్తీ చేసింది.

త్వరలో నోటిఫికేషన్లు :

ఎన్నో సంవత్సరాలుగా పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలను కూడా చేర్చి భర్తీ చేయడానికి ప్రభుత్వం పథకం రూపొందించింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలన అధికారి పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి.

అయితే అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు. 14,236 పోస్టులకు ఆమె సంతకం చేయగా మరో 228 పోస్టులకు కూడా ప్రణాళిక సిద్ధమవుతుంది. గ్రూప్ 1,2,3 లో ఎంపికైన 2711 మంది త్వరలో నియామక పత్రాలు కూడా ఇవ్వనున్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో 61, 759 ఉద్యోగాలను భర్తీ చేసి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి.. భర్తీ చేస్తే 1.16 లక్షల ఉద్యోగాల ప్రక్రియ పూర్తయినట్లే. గ్రామ అధికారులు, అంగన్వాడీలకు సంబంధించిన నోటిఫికేషన్లు రానున్నాయి.

MOST READ : 

  1. Free Sewing Machine : ఉచిత టైలరింగ్ శిక్షణ.. ఉచిత కుట్టు మిషన్.. దరఖాస్తు ఇలా..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

  3. Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. స్నేహితురాలిని ఇంటికి పిలిపించిన యువతి.. అత్యాచారం, ఫోటోలు, వీడియోలతో బెదిరింపు..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

  5. WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!

మరిన్ని వార్తలు