Good News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు గుడ్ న్యూస్..!
Good News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు గుడ్ న్యూస్..!
హైదరాబాద్ , మనసాక్షి :
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. ఉద్యోగులకు, పింఛన్దారులకు ఇచ్చే వివిధ రకాల అలవెన్స్ లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
ఉద్యోగులకు ఇచ్చే అలవెన్స్ లో పెంపు వివరాలు :
♦️ ఉద్యోగులకు , బదిలీపైన వెళ్లే ఉద్యోగులకు రవాణా భత్యంగా 30% పెంపు.
♦️ దివ్యాంగ ఉద్యోగులకు అందజేసే ప్రత్యేక అలవెన్స్ ప్రతినెల రు. 2000 నుంచి రూ. 3000 పెంపు.
♦️కారు కొనుగోలుకు అడ్వాన్స్ గా ఉన్న పరిమితిని 6 లక్షల రూపాయల నుంచి 9 లక్షల రూపాయలకు పెంపు.
♦️ద్విచక్ర వాహనానికి రూ 80,000 నుంచి లక్ష రూపాయలకు పెంపు.
♦️వాహనాలకు రుణాల కేటాయించిన బడ్జెట్లో 50 శాతాన్ని విద్యుత్ వాహనాలకు ఇవ్వాలని నిబంధన విధించారు.
♦️పండుగలకు రూ. 8,500 విద్యార్థులు రూ15,500, వ్యక్తిగత కంప్యూటర్ కొనుగోలు చేయడానికి 50 వేల రూపాయల అడ్వాన్సు ఇస్తారు. వీటన్నింటిని నెల వాయిదాలు 5.50% వడ్డీతో తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
♦️ఉద్యోగుల పిల్లలకు పెళ్లిళ్లకు ఇచ్చే పరిమితిని కూడా పెంచారు. ఆడపిల్ల వివాహానికి లక్ష రూపాయల నుంచి 4 లక్షల రూపాయలకు పెంచారు. కుమారుడి వివాహానికి 75 వేల రూపాయల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచారు.
♦️ఇంటి నిర్మాణానికి గాని, నూతన ఇల్లు కొనుగోలుకు గాని ఇచ్చే అడ్వాన్స్ రుణ పరిమితిని పెంచారు. అత్యల్పంగా 38,890 రూపాయల లోపు మూలవేతనం తీసుకునే వారికి 20 లక్షల రూపాయలు, 62, 110 దాటితే 30 లక్షల రూపాయలు ఇస్తారు. దీనిపై కూడా 5.50 % వడ్డీతో తిరిగి చెల్లించాలి.
♦️శిక్షణ సంస్థలలో పనిచేసే వారికిచ్చే ఇన్సెంటివ్ 30% పెరిగింది.
ఎక్కువ మంది చదివిన వార్తలు మీరు కూడా చదవండి 👇
- Forest Jobs : టెన్త్, ఇంటర్ అర్హతతో అటవీ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం..!
- Gruhalakshmi scheme : గృహలక్ష్మీ పథకంలో ప్రభుత్వం ఇచ్చే రూ. 3 లక్షలు రావాలంటే.. ఇవి ఉండాల్సిందే..!
- Latest Jobs : ఏదైనా డిగ్రీ ఉంటే.. ఉద్యోగ అవకాశాలు, భారీ ప్యాకేజీ..!
- Central scheme | ఈ పథకంలో చేరితే.. రైతులకు నెలకు రూ. 3 వేలు..!
♦️ఇంటలిజెన్స్ , ట్రాఫిక్, సిఐడి ,గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ,యాంటీ నక్సలైట్ స్క్వాడ్ విభాగాలలో పోలీసులకు అందజేసే ప్రోత్సాహకాన్ని 2020 పే స్కేల్ ప్రకారం అందజేస్తారు.
♦️అవినీతి నిరోధక శాఖలో పనిచేసే ఉద్యోగికి మూల వేతనంలో 30 శాతం అదనంగా ప్రోత్సాహం కింద ఇస్తారు.
♦️పింఛన్ దారుడు చనిపోతే అతని కుటుంబానికి అందించే తక్షణ సహాయం రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచారు.
♦️ఉద్యోగులు కారు వినియోగిస్తే కిలోమీటర్ కు పెట్రోల్ కు 16 రూపాయలు , డీజిల్ కు 14 రూపాయలు.
♦️సెలవు రోజులలో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా 150 రూపాయలు చెల్లిస్తారు.
♦️ప్రోటోకాల్ విభాగంలో పనిచేసే అన్ని కేటగిరీలోని ఉద్యోగులకు అదనంగా 15% స్పెషల్ పే మంజూరు చేశారు.










