UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!

UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా భారతదేశం లో కూడా యూపీఐ ఆధారిత గూగుల్ పే, ఫోన్ పే, పేటియం లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు యూపీఐ ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు. పది రూపాయల నుండి లక్షల రూపాయల వరకు కూడా డిజిటల్ చెల్లింపులు చేపడుతున్నారు.
యూపీఐ పై ఆధారపడిన గూగుల్ పే, ఫోన్ పే వాడకం భారీగా పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలో యూపీఐ, రూపే లావాదేవీలపై చార్జి వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అయితే బ్యాంకింగ్ సమాఖ్య ప్రతిపాదనలు పంపడంతో కేంద్రం దానికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. త్వరలో వాటిని అమలు చేయబోతున్నారు.
బ్యాంకింగ్ సమాఖ్య పెద్ద వ్యాపారుల కోసం యూపీఐ లావాదేవీల పై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎం డి ఆర్) ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదన ప్రకారం 40 లక్షల కంటే ఎక్కువ వార్షిక లావాదేవీలు చేసే వ్యాపారులు (MDR) ను పునరుద్ధరించవచ్చును.
ఈ వినియోగదారులు చేసే సాధారణ యూపీఐ లావాదేవులపై ఎటువంటి ప్రభావం చూపదు. మిగతా వారికి చెల్లింపులపై చార్జి వసూలు చేయనున్నారు.
Similar News :
-
UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!
-
Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!









