మిర్యాలగూడ | ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

మిర్యాలగూడ | ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

వేములపల్లి , మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయేలా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు అన్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని శెట్టిపాలెం , రావులపెంట గ్రామాలలో మన ఊరు మనబడి అభివృద్ధి పనులు పూర్తయిన ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించారు.

 

మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.

 

నిరుపేదలకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్న పాపాన పోలేదని, దీంతో ప్రభుత్వ పాఠశాలలన్నీ నిర్వీర్యం అయ్యాయని అన్నారు.

 

నేడు ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్‌ ఏర్పడిందని, ప్రతి బడిలో విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్నదని చెప్పారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మధ్యాహ్నం భోజనం పథకం 8వ తరగతి వరకు అమలయ్యే పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో 9,10 తరగతులకు కూడా విస్తరించి సన్నబియ్యంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నది.

 

Also Read : RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!

 

విద్యా సంవత్సరంలో విద్యార్థులకు రాగి జావ ను కూడా 1వ తరగతి నుండి 10 తరగతి వరకు ఉదయం రాగి జావను అల్పాహారంగా ఇవ్వబోతున్నారు. తెలంగాణ ఆవిర్భావం జరిగి నవవసంతాలు పూర్తయిన సందర్భంగా గత తొమ్మిది సంవత్సరాలుగా అమలు జరిపిన కార్యక్రమాలు రూపొందించిన పథకాలు పాఠశాల విద్యాశాఖను ప్రగతి బాటలో పయనింప చేయడానికి దోహదపడ్డాయి.

 

అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణ విద్యారంగంలో కూడా అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేరడానికి అనుకూలంగా ఉందని భావించారు.

 

Also Read : PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు, కస్టమర్లకు రూ. 2 లక్షల ఆదా…!

 

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆగ్రో చైర్మన్ విజయసింహారెడ్డి, నల్లగొండ జిల్లా రైతు సమితి అధ్యక్షుడు చింతపల్లి శ్రీనివాసరెడ్డ, ఆర్డీవో చెన్నయ్య, ఎంఈఓ బాలాజీ నాయక్, ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య, జడ్పిటిసి ఇరుగు మంగమ్మ, సర్పంచ్ పద్మ సుధాకర్, వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధని, ఎంపీటీసీ పల్ల వీరయ్య,

 

శెట్టిపాలెం టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గౌరీ శ్రీను, టిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్ట మల్లేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, సెక్రటరీ దివ్య, టిఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

Also Read : Govt Job : నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 81 వేల జీతం..!