మిర్యాలగూడ : ప్రభుత్వ బడులలోనే మెరుగైన విద్య

మిర్యాలగూడ : ప్రభుత్వ బడులలోనే మెరుగైన విద్య

మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు

మిర్యాలగూడ ,జూన్ 9, మన సాక్షి :

అపారమైన బోధన నైపుణ్యాలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని తల్లిదండ్రులు విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలని శాసనసభ్యులు నలమోతు భాస్కరరావు కోరారు.

 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బకల్వాడ విద్యా ప్రగతికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ.. మన ఊరు మనబడి కింద నియోజకవర్గ వ్యాప్తంగా 70 పాఠశాలలో ఆధునికీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఉన్నారు.

ఫర్నిచర్ తో పాటు 127 ఉన్నత పాఠశాలలకు స్మార్ట్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నామని , కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిరుపేద వర్గాల విద్యార్థులకు అందుబాటులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు. పఠన నైపుణ్యాలు పెంపొందించుటకు 152 లైబ్రరీ కార్నర్లను ఈ విద్యా సంవత్సరం ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Also read : Upi Payments | ప్రతిరోజు ఎక్కువ సార్లు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 20 నుండి అన్ని పాఠశాలలో ఉదయం రాగిజావ తో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించనున్నామని, ఉచిత పాఠ్యపుస్తకాలు యూనిఫాం లతోపాటు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉచిత నోట్ బుక్కులు కూడా ఈ విద్యా సంవత్సరం అందించనున్నామని పేర్కొన్నారు.

 

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది ఇల్లిల్లూ తిరిగి బడి ఈడు విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు కాబడే విధముగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు.

 

Also read : Phone pe : ఫోన్ పే కీలక మార్పులు.. వాడేవారంతా తెలుసుకోవాల్సిందే..!

 

2023 మార్చిలో జరిగిన పదవ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించిన జడ్పీహెచ్ఎస్ బకాల్వాడ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఆర్డీవో చెన్నయ్య మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి నమోదు పెంచాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్ ప్రధానోపాధ్యాయులు బండా వెంకటరెడ్డి, చిన్న నారాయణరెడ్డి, కస్తూరి ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, కర్నాటి శ్రీనివాసరావు, భగవాన్ నాయక్, రహీం, సైదులు తదితరులు పాల్గొన్నారు.