Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!
Gpay : గూగుల్ పే వాడుతున్నారా.. అయితే మీకు అదిరిపోయే రెండు శుభవార్తలు..!
మనసాక్షి, వెబ్ డెస్క్:
మనీట్రాన్స్ ఫర్ కు వినియోగించే గూగుల్ పే తన యూజర్లకు సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ పే యూజర్లకు రెండు శుభవార్తలు ఒకేసారి తెలియజేసింది. గూగుల్ పే లో పిన్ లేకుండానే మనీ ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. అదేవిధంగా క్రెడిట్ స్కోర్ సులభంగానే చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు సేవలు గూగుల్ పే యూజర్లు పొందవచ్చును.
మీ క్రెడిట్ స్కోరు చెక్ చేసుకోవాలని భావించే యూజర్లు ఉచితంగా పూర్తి చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు.
గూగుల్ పే యాప్ లోకి వెళ్లి కిందికి రావాలి. అక్కడ చెక్ సిబిల్ స్కోర్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చెక్ యువర్ స్కోర్ నౌ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత మీరు మీ పాన్ కార్డు లోని పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేశాక కంటిన్యూ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. అదే విధంగా ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ స్క్రీన్ పై సిబిల్ స్కోర్ ఎంత ఉంటుందో కనిపిస్తుంది.
అదే విధంగా పేమెంట్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా గూగుల్ పే మీకు లోన్ ఆఫర్లు కూడా అందిస్తుంది. డబ్బులు అవసరం అనుకుంటే అప్లై చేసుకోవచ్చును.
🟢 ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇
1. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
2. మిర్యాలగూడ : డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త రైలు మార్గం..!
3. Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!
4. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!
మరోవైపు గూగుల్ పే లైట్ అనే సర్వీస్ కూడా తీసుకొచ్చింది. మీరు పిన్ లేకుండానే పేమెంట్లు చేయవచ్చును. యూపీఐ లైట్ ద్వారా మీరు మీ వాలెట్ లోకి 2000 రూపాయల వరకు డబ్బులు యాడ్ చేసుకోవచ్చును. ఎప్పుడైనా ఈ అవకాశం ఉంటుంది. అదేవిధంగా 200 రూపాయల లోపు ట్రాన్స్ ఫర్ కు అయితే ఎలాంటి పిన్ అవసరం ఉండదు. నేరుగా పేమెంట్లు చేయవచ్చును.
గూగుల్ పే యాప్ ను ఓపెన్ చేయాలి. పైన రైట్ కార్నర్ లో ఉన్న ప్రొఫైల్ టాప్ చేయాలి. అనంతరం “పే పిన్ ఫ్రీ యూపీఐ లైట్” పై క్లిక్ చేయాలి. దాంతో యూపీఐ లైట్ బ్యాలెన్స్ కు డబ్బులు జోడించడానికి ఆన్ స్క్రీన్ పై సూచనలు అనుసరించాలి.
డబ్బులు జోడించడానికి యూపీఐ లైట్ కి మద్దతిచ్చే బ్యాంక్ అకౌంట్ ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. యుపిఐ లైట్ బ్యాలెన్స్ కి డబ్బును యాడ్ చేసిన తర్వాత యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే 200 రూపాయల వరకు పేమెంట్స్ చేసుకోవచ్చును.










