సత్తుపల్లి : అదిరిపోయేలా.. చేనేత, హస్తకళా ప్రదర్శన..!

సందర్శకుల మనసులను దోచుకుంటున్న విభిన్న వస్తువులు

సత్తుపల్లి : అదిరిపోయేలా.. చేనేత, హస్తకళా ప్రదర్శన..!

సందర్శకుల మనసులను దోచుకుంటున్న విభిన్న వస్తువులు

సత్తుపల్లి,మనసాక్షి:

సత్తుపల్లి టీఎస్ఆర్టీసీ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆలిండియా క్రాఫ్ట్ బజార్ పేరుతో ఏర్పాటు చేసిన హస్తకళ ప్రదర్శన,చేనేత ఎంపోరియం పట్టణ ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తుంది.హస్తకళ చేనేత ఉత్పత్తులు సరసమైన ధరలకే విక్రయిస్తుండడంతో వినియోగదారులు అధిక సంఖ్యలో ఆదరిస్తున్నారు. మరి ముఖ్యంగా హస్తకళల వస్తువులు సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

ALSO READ : Treditional Bed : నులక మంచానికి అంతరేటా..? వార్నీ.. ఎందుకో..?

 

దీవాలి స్పెషల్ క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాలలో లభ్యమైన వస్తువులు ఒకచోటకు తెచ్చి ప్రదర్శిస్తుండటం విశేషం అంతేకాకుండా

ఈ ప్రదర్శనలో హైదరాబాద్ నుండి ముత్యాలు,కలంకారి పెయింటింగ్స్,మార్టల్ బొమ్మలు,సారాస్పూర్ ఫుడ్ కార్వింగ్,అగరబత్తులు, ఏటికొప్పాక బొమ్మలు,బీడ్స్ జ్యువలరీ,రాజస్థాన్ బెడ్ షీట్స్,బెంగాలీ కాటన్ సారీస్,మైసూర్ రోజ్ వుడ్, ఒరిస్సా ఆప్టిక్ వర్క్ స్టోన్ ఫొటోస్,బ్యాంబు వర్క్,మెడిటేషన్ ఫొటోస్ తో పాటు ఎన్నో రకాల వస్తువులు ఈ ప్రదర్శనలో ఉన్నాయి.

 

ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9:00 వరకు నిర్వహించినట్లు నిర్వాహకులు సలీం తెలిపారు.