Treditional Bed : నులక మంచానికి అంతరేటా..? వార్నీ.. ఎందుకో..?

Treditional Bed : నులక మంచానికి అంతరేటా..? వార్నీ.. ఎందుకో..?

మన సాక్షి , వెబ్ డెస్క్:

ప్రస్తుతం ఇండియాలో నులక మంచం వాడే వారి సంఖ్య తగ్గిపోతుంది. కొన్ని ప్రాంతాల్లోని నగరాలలో నులక మంచం లేకుండానే పోయింది. కానీ అమెరికాలో మాత్రం దాన్ని కళ్ళకు అద్దుకుంటున్నారట. కొనడానికి నులక మంచాలు కూడా దొరకట్లేవట. ఎంత డబ్బు పెట్టినా.. నులక మంచాల కొరత వల్ల దొరకట్లేవట. ఎందుకో తెలుసా..?

మన భారతీయులం విదేశీ సంస్కృతికి అలవాటు పడినట్లే … విదేశీయులు మన సంస్కృతికి అలవాటు పడుతున్నారు. మనదేశంలో పేదవారు కొనుక్కునే నులక మంచం.. అమెరికాలో ఇప్పుడు బాగా సంపన్నులు కొనుగోలు చేస్తున్నారు. ఇండియాలో తయారవుతున్న ఆ మంచాలు అమెరికాకు వెళ్తున్నాయి.


అమెరికాలో ఈ కామర్స్ వెబ్ సైట్ లో ఒక నులక మంచం ధర ఒక లక్ష రూపాయలకు పైగా పెరిగిపోయిందో చూస్తే .. ఆ మంచానికి ఎంత క్రేజీ ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఆర్డర్లు కూడా వస్తున్నాయి . ఈ కామర్స్ వెబ్ సైట్ భారతీయ సంప్రదాయ నులక మంచం 1,12,075 రూపాయలు ధర ఉంది . కలర్ ఫుల్ గా ఉండే లోక మంచం కావాలంటే 1.5 లక్షలు దాకా వచ్చింది.

ట్రెడిషనల్ ఇండియన్ బెడ్ పేరుతో ఈ నులక మంచాలు లభిస్తున్నాయి. ఈ బెడ్ యొక్క అనేక రంగు ఎంపికలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. Etay ప్లాట్ ఫారంలో కొన్ని రకాల నులక మంచాలు ఉన్నాయి. దీనిని కొనుగోలుదారులు చాలా ఆసక్తి చెబుతున్నారు.

 

కాగా ఒక వినియోగదారుడు Etay వెబ్ సైట్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది చాలా వైరల్ అయింది. అధిక ధర ఉన్నప్పటికీ అమెరికన్లు ఆ మంచాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. కంపెనీ వెబ్ సైట్ లో కొన్ని బెడ్లు మాత్రమే స్టాక్ ఉన్నాయని రాశాడు.