Suryapet : చేతికొచ్చే పంట.. పశువుల పాలాయె.. అడుగంటిన బోర్లు, ఎండిన పొలాలు..!
Suryapet : చేతికొచ్చే పంట.. పశువుల పాలాయె.. అడుగంటిన బోర్లు, ఎండిన పొలాలు..!
పెన్ పహాడ్, మన సాక్షి:
సూర్యాపేట జిల్లా పెన్ పహడ్ మండల పరిధిలోని ఎస్సారెస్పీ కాలువ కింద పంట పొలాలు నిలువునా ఎండిపోతున్నాయి. కాలువ పరిధిలో వారబంధితో పాటు బోర్లు ఎండిపోవడం వల్ల పంట పొలాలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చే వరకు పంట పెట్టుబడి పెట్టిన రైతులు నిలువునా ఎండిపోతున్న వరి పంటలను చూసి బోరున విలపిస్తున్నారు. ఎకరానికి 30 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు వరి పొలాన్ని పశువులను మేపల్సిన పరిస్థితి వచ్చింది.
మండల పరిధిలోని వివిధ గ్రామాల వరి పంట పొలాలకు శ్రీరామ్ సాగర్ కాల్వల ద్వారా కాలేశ్వరం జలాలు వారా బంది ప్రకారం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. దాంతో బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయి కాలేశ్వరం జలాలు రాక పూర్తిస్థాయిలో వరి పొలాలు ఎండిపోయాయి.
పెన్ పహాడ్ మండలంలోని మండల పరిధిలోని పెద్దగారకుంట తండా, గాజుల మల్కాపురం, మాచారం, నూర్జహాన్ పేట గ్రామాలలో మనసాక్షి ప్రతినిధి పంట పొలాలను పరిశీలించారు. కాలేశ్వరం జలాలు గత మూడేళ్లుగా రావడం వల్ల బోరు బావుల్లో నీరు పుష్కలంగా లభించి పంట పొలాలు పండేవి.
కానీ కాలేశ్వరం జలాలు వారబంధి చొప్పున ఇస్తామని చెప్పినప్పటికీ ఎస్సారెస్పీ కాలువకు నీళ్లు రాకపోవడంతో బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. ఆశతో రైతులు వరినారులు వేసినప్పటికీ బోర్లు ఎండిపోవడంతో వంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయి. ఎండిపోయిన పొలాలను పశువులు, గొర్రెలు మేపుతున్నారు. అక్కడి రైతులను కదిలిస్తే కంటనీరు పెట్టుకున్నారు.
గతములో శ్రీరాంసాగర్ కాలువల ద్వారా కాలేశ్వరం జలాలు రావడంతో గత మూడు సంవత్సరముల నుండి పంటలు పండుతున్నాయని, ఇప్పుడు ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో వారాబంది ప్రకారం ఇస్తామని చెప్పినా ఉత్తమాటలైనాయని, బోర్లు ఎండిపోయినాయని, అప్పులు తెచ్చి ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయినమని రైతులు గుండు వెంకన్న, కొండేటి వెంకటరెడ్డి, షేక్
గురక ఆవేదన వ్యక్తం చేశారు.
మాచారం రెవిన్యూ పరిధిలో మహిళా రైతు జడ మంగమ్మ, వీరయ్య తమ ఎండిపోయిన వరి పొలాన్ని చూపించి బోరున విలపించారు. పిల్లల చదువుల కోసం అప్పులు, రెండు ఎకరాల వరి పొలానికి 60 వేల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని, రెండు ఎకరాల పొలం కాలేశ్వరం జలాలు రాక పూర్తిగా పొలం ఎండిపోయిందని ఆవేదన వెలిబుచ్చారు.
నూర్జాన్ పేట గ్రామానికి చెందిన మహిళ రైతు ఎండిపోయిన పొలంలో వరిని కోసి పాడి గేదెలకు వేస్తున్నామని కాళేశ్వరం జలాలు ఇస్తారనే ఆశతో వరి పొలం సాగు చేశామని ధారావతు కలమ్మ అన్నారు.
Reporting : Nageshwar Rao
Penpahad (Suryapet)
MOST READ :
-
Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
-
TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
-
Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!










