Breaking NewsTOP STORIESజాతీయం

SRISHAILAM : శ్రీశైలంకు కృష్ణ, తుంగభద్ర నుంచి భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం, వారం రోజులు కొనసాగితే..!

SRISHAILAM : శ్రీశైలంకు కృష్ణ, తుంగభద్ర నుంచి భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం, వారం రోజులు కొనసాగితే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

గత వారం రోజులుగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులు పొంగుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి భారీ వరద ప్రవాహం సాగుతోంది. కృష్ణానది ఎగువ భాగంలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండడంతో 2.50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి కూడా 90 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వస్తుంది. దాంతో కృష్ణ, తుంగభద్ర ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 2.54 లక్షల క్యూసెక్కుల నీరు వరద నీరు వచ్చి చేరుతుంది. కాగా శ్రీశైలం జలాశ నీటిమట్టం గంట గంటకు పెరుగుతుంది.

శ్రీశైలం జలాశ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 855.20 అడుగులకు చేరింది. జలాశయంలో 215.81 టీఎంసీల నీటికి గాను ప్రస్తుతం 92.50 టిఎంసిల నీరు ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో వారం రోజులపాటు శ్రీశైలం జలాశయానికి ఇదే వరద కొనసాగితే జలాశయం పూర్తిస్థాయిలో నిండనున్నది. దాంతో శ్రీశైలం గేట్లు తేర్చుకొనున్నాయి.

నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో :

నాగార్జునసాగర్ కు శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే నీరు ఇన్ ఫ్లో కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31, 784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా ప్రస్తుతం సాగర్ కు 13వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. అదేవిధంగా 9000 అవుట్ ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 503.8 అడుగుల నీరు ఉంది.

ఇవి కూడా చదవండి : 

Narayanpet : జూరాల పునరావాస కేంద్రాల భూసేకరణకు త్వరలో డబ్బులు..!

BUDGET 2024 : తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత..!

SRISHAILAM : శ్రీశైలంకు భారీ వరద.. విద్యుత్ ఉత్పత్తితో దిగువకు నీటి విడుదల..!

సినీ పక్కీలో చోరీకి యత్నం.. 60 ఏళ్ల వృద్ధురాలు దొంగలకు బడిత పూజ..! 

మరిన్ని వార్తలు