Narayanpet : జూరాల పునరావాస కేంద్రాల భూసేకరణకు త్వరలో డబ్బులు..!
Narayanpet : జూరాల పునరావాస కేంద్రాల భూసేకరణకు త్వరలో డబ్బులు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట జిల్లాలో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నీటిపారుదల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. 57.44 ఎకరాల భూమి సేకరణ పనులు పెండింగ్ ఉన్నాయన్నారు. 82.35 ఎకరాల భూసేకరణకు సంబంధించిన డబ్బులు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నారాయణపేట పరిధిలో ఉన్నాయని తెలిపారు.
జూరాల డ్యాం పునరావాస కేంద్రాల ప్రాంతాలైన మక్తల్ మండలంలోని అనుగొండ, అంకెన్ పల్లి, ధాదన్ పల్లి భూసేకరణ కు సంబoదించి డబ్బులు త్వరలోనే వచ్చే ఆస్కారం ఉందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో డి.ఎస్ ఈ బాలరాజు,ఈ ఈ బ్రహ్మానంద, సంజీవప్రసాద్ డి. ఈ. ఈ., ఏ. ఈ. ఈలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
NALGONDA : డిజిటల్ బోధన తీరుపై జిల్లా కలెక్టర్ పరిశీలన.. విద్యార్థులతో ముఖాముఖి..!
BUDGET 2024 : తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత..!
సినీ పక్కీలో చోరీకి యత్నం.. 60 ఏళ్ల వృద్ధురాలు దొంగలకు బడిత పూజ..!









