తెలంగాణలో భారీ వర్షాలు.. ఉప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్, పాఠశాలలకు హాలిడే..!
తెలంగాణలో భారీ వర్షాలు.. ఉప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్, పాఠశాలలకు హాలిడే..!
మన సాక్షి , హైదరాబాద్ :
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరం జలమయమైంది. రోడ్లు కాలనీలో చెరువులను తలపిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం భారీగా కురుస్తుంది.
వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉప్పల్ కూడలిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరంగల్ హైవే నిర్మాణంలో ఉన్నందున వరద ప్రవాహం భారీగా రోడ్డుపై నిలిచి ఉండడంతో వాహనాలు ఎక్కడికి ఎక్కడ నిలిచిపోయాయి. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చిమ్మ చీకట్లు కొమ్ముకొని భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాలవాసులు బయటకు రావద్దని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు.
గత వారం రోజులుగా ఎండ, ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోయారు. అడపాదడపా వర్షం పడుతున్నప్పటికీ కూడా ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. భారీ వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ALSO READ :
యువకుడి సెల్ఫీ వీడియో.. ప్రాణం తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..!









