Paddy : కొత్త రకం వరి విత్తనాలతో అధిక దిగుబడి..!

Paddy : కొత్త రకం వరి విత్తనాలతో అధిక దిగుబడి..!
అర్వపల్లి, మన సాక్షి :
రైతులు కొత్త రకం విత్తనాలను సాగు చేసి అధిక దిగుబడును సాధించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కంప సాగర్ పాలిటెక్నిక్ కాలేజీ శాస్త్రవేత్త స్వాతి అన్నారు.
శుక్రవారం మండల పరిధిలోని రామన్నగూడెం లో ప్రభుత్వం పంపిణీ చేసిన విత్తనాలతో సాగు చేస్తున్న రైతులతో కలిసి మాట్లాడారు.
కేఎన్ మ్1638 వరి రకం, జి జి 385 పెసర విత్తనాలను, వివిధ గ్రామాలకు చెందిన 36 మంది రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఈరోజు నూతన విత్తనాల దిగుబడి ఏ విధంగా ఉన్నదా ఫీల్డ్ వెరిఫికేషన్ కు మండల అధికారులు పరిశీలించారు. రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి పెద్దింటి గణేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు, నేరెళ్ల సత్యం, శోభ రాణి, రైతులు, బండారు సోమయ్య వర్ధమానుకోట, దొరపల్లి వెంకన్న, రామన్నగూడెం, డాక్టర్ వెంకన్న కుంచమర్తి, విజయ , జానయ్య, పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : ఎమ్మెల్యే టికెట్ అనుకుంటే.. ఏకంగా మంత్రి పదవి దక్కింది..!
-
SBI JOBS : ఎస్బిఐ లో భారీ ఉద్యోగాల జాతర.. 3500 పోస్టుల భర్తీకి సన్నాహాలు..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి దేవస్థానం ఇంజనీర్..!
-
Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!









