Breaking Newsక్రైంజాతీయం
Fire Accieent : గోవాలో భారీ ప్రమాదం.. 23 మంది మృతి..!

Fire Accieent : గోవాలో భారీ ప్రమాదం.. 23 మంది మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
గోవాలో భారీ అగ్ని ప్రమాద సంఘటన చోటుచేసుకుంది. నార్త్ గోవాలోని ఒక నైట్ క్లబ్ లో శనివారం అర్ధరాత్రి సిలిండర్ పేరు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
చనిపోయిన వారిలో ఎక్కువమంది క్లబ్ లో కిచెన్ సిబ్బంది ఉన్నారు. వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మరణించిన వారిలో నలుగురు పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ముఖ్యమంత్రి సావంత్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మరో 25 రోజుల్లో నూతన సంవత్సరం రాబోతున్న తరుణంలో ఇలాంటి దురదృష్టకరం జరిగింది అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.









