New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!

New Aadhaar Rules : ఆధార్ రూల్స్ లో భారీ మార్పులు.. నవంబర్ 1 నుంచి అమల్లోకి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఆధార్ కార్డులో భారీ మార్పులు చేసుకోబోతున్నాయి. నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నది. ప్రస్తుతం ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే ఆధార్ కేంద్రానికి పరుగులు పెట్టి.. క్యూలో నిల్చుని, టోకెన్లు సైతం తీసుకొని పడిగాపులు కాస్తూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న మార్పులకు కూడా ఒక రోజంతా ఆధార్ కేంద్రం వద్దనే ఉండాల్సి వస్తుంది. ఒక్కోసారి రద్దీ ఉండటం వల్ల రెండు, మూడు రోజులు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇకపై అలాంటిది ఉండదని యు ఐ డి ఏ ఐ తెలిపింది. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, జండర్, చిరునామా, మొబైల్ నెంబర్ లాంటి వివరాల మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదని తెలియజేసింది. అలాంటి మార్పులన్నీ ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్ లో చేసుకునే అవకాశాన్ని నవంబర్ ఒకటో తేదీ నుంచి కల్పించనున్నది.
అందుకోసం గాను ఆధార్ అప్ డేట్ లో సరికొత్త మార్పులు చేయనున్నది. ఆధార్ అప్డేట్ ప్రక్రియ మరింత వేగంగా సురక్షితంగా మార్చడం కోసం ఈ ఆన్‌లైన్ విధానాన్ని తీసుకురానున్నట్లు తెలియజేసింది. ఫింగర్ ప్రింట్, ఐరిష్ లాంటివి మాత్రమే బయోమెట్రిక్ అప్డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లవలసి ఉంటుంది.
అయితే ఆధార్ అప్డేట్ కి సంబంధించిన ఫీజులు కూడా పెరిగాయి. పేరు, అడ్రస్ మార్పులకు 75 రూపాయలు, బయోమెట్రిక్ మార్పులకు 125 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. 15 సంవత్సరాల లోపు చిన్నారులకు బయోమెట్రిక్ మార్చేందుకు ఎలాంటి ఫీజు లేదని యు ఐ డి ఏ ఐ పేర్కొన్నది.
MOST READ :
-
SBI JOBS : ఎస్బిఐ లో భారీ ఉద్యోగాల జాతర.. 3500 పోస్టుల భర్తీకి సన్నాహాలు..!
-
Gold Price : మరోసారి గోల్డ్ ధర ఢమాల్.. ఒక్కరోజే భారీగా తగ్గిన ధర..!
-
Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!
-
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!
-
Wines Tenders : అదృష్టవంతుడు అంటే ఇతడే.. ఐదు వైన్స్ లకు టెండర్లు వేస్తే ఐదు దక్కాయి..!









