Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. మూడు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల..!

Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. మూడు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం డబ్బులు రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
2025 జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ఆయన ప్రారంభించారు. కాగా ఒక విడత రైతు భరోసా పెట్టుబడి సహాయం 6000 రూపాయలను రైతుల ఖాతాలలో జామ చేస్తున్నారు.
ఫిబ్రవరి 5వ తేదీన ఒక ఎకరం లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయగా, ఫిబ్రవరి 10వ తేదీన రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేశారు. వెంటనే వారి వారి ఖాతాలలో నిధులు జమ అయ్యాయి.
కాగా బుధవారం మూడు ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేశారు. రైతుల ఖాతాలలో 1230 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. కాగా ఇప్పటివరకు రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం 3,487.25 కోట్ల రూపాయలను పెట్టుబడి సహాయంగా పంపిణీ చేసింది.
■ Similar News :
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!
-
Rythu Bharosa : రైతు భరోసా నిధులు విడుదల.. రెండు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో జమ.. బిగ్ అప్డేట్..!
-
Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. వారికి రైతుభరోసా కట్..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ.. ముందుగా వారికే.. బిగ్ అప్డేట్..!









