TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!

TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాలలో త్వరలో డబ్బులు జమ చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు సన్నధాన్యంకు క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దాన్యం కొనుగోలు చేసింది. దానం కొనుగోలు కేంద్రాలలో సన్నధాన్యం విక్రయించుకున్న రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించింది. కాగా ఇంకా కొంతమందికి బోనస్ డబ్బులు ఖాతాలలో రాలేదు. అందుకోసం రైతులు ఆవేదన చెందుతున్నారు.
వానాకాలం విక్రయించిన ధాన్యంకే బోనస్ రాలేదని, యాసంగి పంటలు కోతకు వచ్చాయని రైతుల పేర్కొంటున్నారు. ఒక సీజన్ ముగిసే వరకు కూడా బోనస్ డబ్బులు ఖాతాలలో రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు మాత్రం త్వరలో బోనస్ బకాయి ఉన్న రైతులకు ఖాతాలలో జమ చేయనున్నట్లు పేర్కొంటున్నారు.
అయితే బోనస్ రైతుల ఖాతాలలో జమ కావడానికి ఎంత గడువు పడుతుందనేది తెలియడం లేదు. వ్యవసాయ అధికారులు మాత్రం త్వరలో బోనస్ రైతుల ఖాతాలలో జమ అవుతుందని చెబుతున్నారు.
MOST READ :
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!
-
Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!
-
TG News : తెలంగాణలో విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..!
-
Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!









