Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

భార్యను నరికి చంపిన భర్త..!

భార్యను నరికి చంపిన భర్త..!

కంగ్టి, మన సాక్షి :

భార్యను గోడ్డలతో కిరాతకంగా నరికిచంపిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుర్కవడగామ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కవడగామ గ్రామానికి చెందిన చంద్రమ్మ (45) కూలి పనిచేసి కాలం వెల్లదీస్తుంది.

బుధవారం అర్ధరాత్రి భర్త గుండప్ప మద్యం సేవించి వచ్చి భార్య చంద్రమ్మతో గొడవ పెట్టుకున్నాడు. మాట మాట పెరగడంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య చంద్రమ్మను అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ విషయం గురువారం తెల్లవారుజామున తెలియడంతో వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గుండప్పను అదుపులోకి తీసుకున్నారు.

గతకొన్ని సంవత్సరాల నుంచి వీరిద్దరి మధ్య తరచుగొడవలు జరిగేవని గ్రామస్తులు తెలుపుతున్నారు. చంద్రమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త గుండప్ప పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విజయ్ కుమార్ వెల్లడించారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు