BREAKING : హైదరాబాదులో భారీ వర్షం , పలు ప్రాంతాల్లో నిలిచిన ట్రాఫిక్

హైదరాబాదులో భారీ వర్షం , పలు ప్రాంతాల్లో నిలిచిన ట్రాఫిక్

హైదరాబాద్, మనసాక్షి ;

హైదరాబాదులో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈదురు గాలులతో పాటు భారీ వర్షం పడుతుంది. నగరంలోని పలుచోట్ల వర్షం కురియడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.

 

నగరంలోని గచ్చిబౌలి, చందానగర్ , శేర్లింగంపల్లి, పటాన్ చెరువు ,కొండాపూర్, సూరారం ,జీడిమెట్ల, కుతుబుల్లాపూర్ ప్రాంతాల్లో జల్లులు కురుస్తున్నాయి.

 

అదేవిధంగా కూకట్ పల్లి , హైదర్నగర్, ఆల్విన్ కాలనీ, కెపిహెచ్ బి, నిజాంపేట్, బాచుపల్లి ,వివేకానంద నగర్ , హయత్ నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది.

 

పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు భారీగా రోడ్లపైకి రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది.