హైదరాబాద్ నగరానికి రెడ్ అలర్ట్..!

హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్ష సూచన ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే నగరంలోని పలుచోట్ల భారీ వర్షం పడటంతో పాటు ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్ నగరానికి రెడ్ అలర్ట్..!

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాద్ నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్ష సూచన ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే నగరంలోని పలుచోట్ల భారీ వర్షం పడటంతో పాటు ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి.

ఈ క్రమంలోనే రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ఈదురుగాలులో, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది.

నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ,గచ్చిబౌలి, కొండాపూర్ ,లింగంపల్లి, అశోక్ నగర్, ఖైరతాబాద్, మియాపూర్, లకిడికాపూల్, దిల్సుఖ్ నగర్, అబిడ్స్, కోఠి, బషీర్ నగర్, సుల్తాన్ బజార్ ,బేగం బజార్, అఫ్జల్గంజ్ ప్రాంతాలలో వర్షం పడుతుంది. భారీ వర్షానికి నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ALSO READ : Khairathabad Ganesh : ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం.. శోభాయాత్ర ప్రారంభం ఎప్పుడంటే..!

ఇదిలా ఉండగా మరోవైపు మూడు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణలోని వానలు పడతాయని తెలిపింది.

హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి మల్కాజ్గిరి ,వనపర్తి, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ALSO READ : MIRYALAGUDA : 27న మిర్యాలగూడ జిల్లా బంద్.. విజయవంతం చేయాలి..!