Rythu Bharosa : రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు.. ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే..!
Rythu Bharosa : రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు.. ప్రారంభమైన క్షేత్రస్థాయి సర్వే..!
పెన్ పహాడ్, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సాగు చేయని భూములను క్షేత్ర స్థాయి పర్యాటనలలో గుర్తించి వారిని రైతు భరోసా పథకానికి అనర్హులుగా తొలగించడానికి ప్రభుత్వ అధికారులు గురువారం నుండి సర్వే నిర్వహించారు. గురువారం గ్రామాల వారీగా జరిగే సర్వే ప్రారంభమైనది.
ఈ సందర్భంగా తాసిల్దార్ ధారావత్ లాలు నాయక్ మాట్లాడుతూ అధికారులు సమన్వయం చేసుకుంటూ జనవరి 16 నుండి 20 వరకు గ్రామాల వారీగా క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తూ సర్వే నెంబర్ ప్రకారం సాగు చేయని భూములను గుర్తించాలన్నారు.
సాగు చేయని భూములలో రాళ్లు, గుట్టలు ను సర్వేయర్ ద్వారా వివరాలు సేకరించాలని, పల్లెల్లో లే అవుట్ లు, నాలా గా మార్చిన భూములను, ఇండస్ట్రీ లకి సంబందించిన వివరాలను సర్వే ద్వారా సేకరిస్తున్నామని సాగు చేయని భూముల వివరాలను జనవరి 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలలో తెలియపర్చి వారిని రైతు భరోసా పథకం కు అనర్హలుగా గుర్తించాలని సూచించారు.
తదుపరి సాగు చేసే ప్రతి ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలను రైతు భరోసా పథకం క్రింద ప్రభుత్వం అందెజెస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ ,ఇంచార్జ్ సర్వేరూ ప్రసాద్, ఆర్ ఐ రంజిత్ రెడ్డి ,ఏఈఓ శ్రావణి, జూనియర్ అసిస్టెంట్ ఆజీర్, తదితరులు పాల్గొన్నారు.
-
MOST READ :
-
Gold Price : పసిడి ధర భారీగా షాక్.. సామాన్యులు కొనలేరా..!
-
Viral Video : సైలెంట్ గా నిలబడిన కోడి.. పందెంలో గెలిచింది.. (వీడియో వైరల్)
-
Rythu Bharosa : రైతు భరోసా కు వారిని అనర్హులుగా గుర్తించాలి.. జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!
-
Railway Jobs : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!
-
Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!









