బ్రిజ్ భూషణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి

బ్రిజ్ భూషణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి
నల్లగొండ , మన సాక్షి:

మహిళా రెజ్లర్లలను లైంగికంగా వేధించిన బిజెపి ఎంపీ బ్రిడ్జ్ భూషణ్ ను వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండ పట్టణ కేంద్రంలోని సుభాష్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఢిల్లీలో మహిళ రేజ్లార్లు ఢిల్లీ నడివీధుల్లో దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం పట్టించుకోక పోవడం అన్యాయం అన్నారు. మన దేశానికి సువర్ణ పథకాలు తీసుకొచ్చిన మహిళలకు రక్షణ లేకుండా పోయిందని లైంగిక వేధింపులు హత్యలు, అత్యాచారాలు చేసిన వారిని బలపరిచే సంఘాలు పుట్టుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

దోషులకు జైళ్లు కోర్టులు ఆశ్రమ నిలయాలుగా మారాయని అన్నారు. మామూలు మహిళల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ,జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి, పుష్ప, భార్గవి, వాగ్దేవి,స్వాతి, అనూరాధ తదితరులు పాల్గొన్నారు.