ప్రపంచంBreaking News

మాపై అమెరికా దాడి చేస్తే.. మేము భారత్ పై బాంబులేస్తాం, ఢిల్లీ, ముంబై లక్ష్యం..!

అమెరికా తమపై దాడి చేస్తే పొరుగు దేశమైన భారత్ పై బాంబులేస్తామని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ పేర్కొన్నారు.

మాపై అమెరికా దాడి చేస్తే.. మేము భారత్ పై బాంబులేస్తాం, ఢిల్లీ, ముంబై లక్ష్యం..!

మన సాక్షి, వెబ్ డిస్క్ :

అమెరికా తమపై దాడి చేస్తే పొరుగు దేశమైన భారత్ పై బాంబులేస్తామని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ పేర్కొన్నారు. CNN న్యూస్ 18 లో జరిగిన చర్చ వేదికలో బాసిత్ మాట్లాడుతూ యుద్ధంలో ఇరాన్ పై ఇజ్రాయిల్ పైచేయి సాధిస్తే ఆ తర్వాత సమీపంలో ఉన్న పాకిస్తానే ఇజ్రాయిల్ కు తదుపరి లక్ష్యం కావచ్చని పేర్కొన్నారు.

ఇజ్రాయిల్ చెప్పుడు మాటలు విని అమెరికాకు అప్పుడు పాకిస్తాన్ అను కార్యక్రమాలు రుచించకపోవచ్చునని ఆ సమయంలో పాకిస్తాన్ పై అమెరికా దాడులు చేయొచ్చు. ఇలా జరగడానికి అవకాశం లేదు. కానీ ఒకవేళ పాకిస్తాన్ పై దాడి చేస్తే ప్రతి దాడిగా మేము గల్ఫ్ లేదా ఇజ్రాయిల్ పై దాడి చేయడం కష్టమవుతుంది. అవన్నీ మాకు సుదూర ప్రాంతాలుగా ఉన్నాయి.

కానీ సమీప లక్ష్యంగా మేము భారత్ పై మాత్రం దాడి చేస్తామని పేర్కొన్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముంబై, ఢిల్లీ లపై దాడులు చేస్తామని తర్వాత ఏం జరుగుతుందని దానితో మాకు సంబంధం లేదని, అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మాపై దాడులు జరుగుతున్నప్పుడు మాకు కనిపించే ఏకైక మార్గం ఇండియానే భారత్ లోని మెట్రోపాలిటన్ నగరాలపై దాడులు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే బాసిత్ మాట్లాడడం పై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. శత్రుదేశాలను ఎదుర్కోలేక పొరుగు దేశం పై బాంబులు వేస్తామనే పాకిస్థాన్ వైఖరి బహిర్గతమైందని అంతర్జాతీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు.

MOST READ

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు