Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా

Thammineni : ఎన్నికల హామీలు అమలు చేయకపోతే.. ప్రభుత్వంపై తమ్మినేని సంచలన వ్యాఖ్యలు.! 

Thammineni : ఎన్నికల హామీలు అమలు చేయకపోతే.. ప్రభుత్వంపై తమ్మినేని సంచలన వ్యాఖ్యలు.! 

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన పోరాటాలు నిర్వహిస్తాం

ఎర్ర జెండా రోజులు మళ్లీ వచ్చాయి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సూర్యాపేట,  మనసాక్షి :

ఎర్ర జెండా పోరాటాల ఫలితంగా రేవంత్ ప్రభుత్వం భూ సేకరణను వెనక్కి తీసుకుంటూ నోటిఫికేషన్ ఇచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా మూడవ మహాసభల సందర్భంగా గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం లగచర్ల గ్రామంలో గిరిజన రైతుల భూములను ఫార్మా కంపెనీల కోసం బలవంతంగా తీసుకోవడానికి వ్యతిరేకిస్తూ ప్రజలు పోరాటం చేశారని, ఆ పోరాటాలను అంచివేస్తూ దొరికిన వారిని దొరికినట్లు అక్రమంగా అరెస్టు చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన సందర్భంగా ఎర్ర జెండా పార్టీలు కదిలి ఆ గ్రామాలలో పర్యటించాయన్నారు.

ప్రభుత్వం వామపక్ష పార్టీలకు అనుమతి ఇవ్వాలని కోరామని అనుమతి ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చేసిన హెచ్చరికల మూలంగా ప్రభుత్వం లగచర్ల లో వామపక్ష పార్టీల పర్యటనకు అనుమతి ఇచ్చిందన్నారు.

పర్యటన సందర్భంగా అనేక విషయాలను గిరిజన రైతుల నుండి తెలుసుకొని అక్కడి సమస్యలను ముఖ్యమంత్రి కలిసి వివరించామని అన్నారు. ఎర్రజెండా పోరాటం మూలంగా ప్రభుత్వం ఫార్మా కంపెనీని వెనక్కి తీసుకోవడం ఎర్రజెండా పార్టీల పోరాటాల ఫలితంగా నని అన్నారు.

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోస్వేచ్ఛ ఉంటుందని సచివాలయానికి ఉన్నగేట్లను తొలగించారనిరాష్ట్ర ప్రజలకు ఏడవ గ్యారెంటీ అయినా స్వేచ్ఛను ప్రజలకు అందిస్తారని చెప్పినేడు మాత్రం కెసిఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్టు చేస్తూ వారిపై కేసులు పెడుతుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 11 మాసాలు అవుతున్న నేటికీ ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేయలేదన్నారు. రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ,రైతు భరోసా,వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000, మహిళలకు 2500,పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయం వంటి హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు.

హామీల అమలుకు బలమైన పోరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కలిగిన సూర్యాపేటలోపెద్ద ఎత్తున హాజరైన సిపిఎం పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగే అనేక ప్రజా ఉద్యమాలలో జిల్లా ప్రజానీకం అత్యంత ఉత్సావంతంగా పాల్గొనాలని పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతుందని ఆరోపించారు.

అంబానీ, ఆదాని ని లకు రాయితీలు ఇస్తూ పేదలపై అనేక భారాలు మోపుతున్నారని విమర్శించారు. లాభాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశంలో ఉన్న మెజార్టీ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే అంబానీ ఆధానీల ఆస్తులు మాత్రం వేల కోట్లకు పెరుగుతున్నాయని అన్నారు.

బిజెపి దేశంలో అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలో ప్రజలపై మత భావాలను రుద్దుతూ దేశంలో ఐక్యంగా ఉన్న హిందూ, ముస్లిం, క్రైస్తవ, దళితుల మధ్యన చిచ్చు పెడుతూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని విమర్శించారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలపై ధరల భారం పడుతుందన్నారు. మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు మహిళలు పట్ట పగలు కూడా నడిచే పరిస్థితి లేదన్నారు.

మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులను నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలోసరైనటువంటితిండి లేక మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు పెరిగిన అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న విద్య, వైద్యం ప్రజలకు ఉచితంగా అందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయంత వరకుప్రజా పోరాటాలకుప్రజలు సిద్ధం కావాలని ప్రజలకు ఎర్రజెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.

అంతకుముందు కుడకుడ రోడ్డులోని భాగ్యలక్ష్మి రైస్ మిల్ నుండి కొత్త బస్టాండ్ మీదిగా శంకర్ విలాస్ సెంటర్, పాత వ్యవసాయ మార్కెట్, పోస్ట్ ఆఫీస్ మీదుగా గాంధీ పార్కుకు ప్రజా ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా ప్రదర్శనలో విచిత్ర వేషాలు, రైతు వేషాలు, డప్పు కళాకారుల విన్యాసం, కోలాట ప్రదర్శనలు, ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు చూపరులకు, ప్రజలకు విశ్లేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామానికి చెందిన పది కుటుంబాలు వివిధ పార్టీలకు రాజీనామా చేసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమక్షంలో సిపిఎం పార్టీ ప్రజా సంఘాల్లో చేరారు. వారికి ఆయన జండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కో లిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లి సైదులు, నాగారపు పాండు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల రవి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు