ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది

ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది

మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది విజయవంతం.
శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీ బయల్దేరి వెళ్ళిన రాష్ట్రపతి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఈనెల 26న హైదరాబాద్ కు శీతాకాల విడిది కోసం భారత వాయుసేన ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకొన్న ఆమె పర్యటన శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం 3.40 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ భారత వాయుసేన ప్రత్యేక విమానంలో 3.55 గంటలకు హకీంపేట విమానాశ్రయాని నుండి దేశ రాజధాని ఢిల్లీకి తిరిగి పయనమయ్యారు.

ఈ సందర్భంగా ఆమెకు వీడ్కోలు పలికేందుకు హకీంపేట విమానాశ్రయానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, త్రివిధ దళాల ఉన్నతాధికారులు తదితరులు వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, నోడల్ ఆఫీసర్ రవి, డీసీపీ సందీప్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస మూర్తి, పేట్ బషీర్భాగ్ ఏసీపీ రామలింగరాజు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.