Nalgonda : 12వ బెటాలియన్ లో ఇంటర్ కాయి గేమ్స్ స్పోర్ట్స్ మీట్..!
Nalgonda : 12వ బెటాలియన్ లో ఇంటర్ కాయి గేమ్స్ స్పోర్ట్స్ మీట్..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా కేంద్రం అన్నేపర్తి వద్ద ఉన్న 12 వ స్పెషల్ పోలీస్ బెటాలియన్ లో బుధవారం నిర్వహించిన ఇంటర్ కాయి గేమ్స్ స్పోర్ట్స్ మీట్స్ ముగింపు కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులు 24 గంటలు ప్రజలను కాపాడే వారని ,అలాంటి పోలీసు ఉద్యోగులకు, పోలీస్ శాఖకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
12వ బెటాలియన్ లో సి సి రహదారుల నిర్మాణానికి 60 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు. అలాగే 12వ బెటాలియన్ లోని పోలీసులకు సంబంధించి పెండింగ్లో ఉన్న డిఎ, సరెండర్ వంటివి మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
12వ బెటాలియన్ కు సమీపంలో ఉన్న దేవాదాయ శాఖకు చెందిన 3 ఎకరాల స్థలంలో 25 కోట్ల రూపాయలతో పర్యటకశాఖ ద్వారా హరిత హోటల్ ను నిర్మించనున్నామని, 12 వ బెటాలియన్ ఉద్యోగులు చిన్న చిన్న ఫంక్షన్లు, వివాహాల వంటివి అందులో చేసుకోవచ్చని తెలిపారు.
అంతేకాక ఇటువైపున మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉందని ,2004లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీకి నెల రోజుల్లో కొత్త వైస్ ఛాన్స్ లర్ తో పాటు, ఎగ్జిక్యూటివ్ కమిటీ రానున్నదని, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కి బడ్జెట్ ను, మౌలిక సదుపాయాలను కల్పించి పటిష్టం చేస్తామన్నారు.
జిల్లాలోని అన్ని చెరువులు నింపి బ్రాహ్మణ వెళ్లెముల ప్రాజెక్టును పూర్తి చేస్తానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా గడచిన 3 రోజులుగా బెటాలియన్ లో నిర్వహించిన కబడ్డీ, క్రికెట్ ,వాలీబాల్ అథ్లెటిక్ పోటీలలో గెలుపొందిన వారికి మంత్రి జ్ఞాపికలను అందజేశారు.
12వ బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాస్ ,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ,మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య,12 వ బెటాలియన్ పోలీస్ అధికారులు, డిఎస్పి శివరామిరెడ్డి,తహసీల్దార్ శ్రీనివాస్, తదితరులు ఈ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ కు హాజరయ్యారు.
LATEST UPDATE :
-
MLA Adinarayana : ప్రకృతి సిద్ధమైన తాటికల్లుతో ఆరోగ్యం.. ఎమ్మెల్యే ఆదినారాయణ..!
-
Komatireddy Venkatreddy : రైతులకు గుడ్ న్యూస్.. మూడు రోజుల్లోనే వారి ఖాతాలలో డబ్బులు జమ..!
-
Miryalaguda : అంగన్వ్వాడీ టీచర్ సాగర్ కాల్వలో గల్లంతులో బిగ్ ట్విస్ట్.. ప్రమాదంగా చిత్రీకరించిన భర్త..!
-
ఒక్క గూగుల్ పే పేమెంట్.. ఎంత పని చేసింది.. లండన్ టు హైదరాబాద్..!









