TOP STORIESBreaking Newsప్రపంచం

సెప్టెంబర్ 17న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనబోతుందా.. కలవర పడుతున్న మానవాళి..!

సెప్టెంబర్ 17న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనబోతుందా.. కలవర పడుతున్న మానవాళి..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

సెప్టెంబర్ 17వ తేదీ వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా మానవాళి కలవరపడుతుంది. ఆస్టరాయిడ్ భూమిని ఢీ కట్టబోతుందా..? ఏం జరుగుతుందోనని మానవాళి ఆందోళన చెందుతుంది. భూమి వైపుకు అత్యంత వేగంగా అతి దగ్గరగా గ్రహశకలం వచ్చి వెళ్తుంది. ఇప్పుడు గ్రహ శకలం (ఆస్టరాయిడ్స్) భూమికి దగ్గరగా రాబోతున్నాయి. సౌర కుటుంబంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి.

అయితే కొన్ని ఆస్టరాయిడ్స్ భూమిని ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రపంచ అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఇలాంటి గ్రహశకలాలపై ఎల్లప్పుడూ నిఘా వేసి ఉంచుతారు. అయితే ఓ భారీ శకలం భూమి వైపుకు దూసుకొస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ శాఖలో గమనం సహజంగానే మానవాళిని కలవరపెడుతుంది. భూమిని ఢీకొట్టే ప్రమాదం కూడా ఉందని తెలుస్తోంది.

60 అంతస్తుల భవనం పరిమాణంలో ఉండే ఈ గ్రహశకలం ఈనెల 17వ తేదీన భూగోళాన్ని దాటుకొని వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. (220 – 480 మీటర్ల) చుట్టు కొలతతో ఉన్న ఈ ఆస్టరాయిడ్ ‘2024 ఆన్’ అని నామకరణం చేశారు. అయితే ఈ ఆస్టరాయిడ్ భూగోళానికి దాదాపు లక్ష కిలోమీటర్ల చేరువగా రానున్నది.

భూమికి చంద్రునికి మధ్య ఉన్న సగటు దూరం కంటే 2.6 రెట్లు ఎక్కువ. అయితే ఈ ఆస్టరాయిడ్ ప్రస్తుతం గంటకు 31,933 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుందని, ధ్వని వేగం కంటే 26 రెట్లు అధికంగా ఉంటుందని లైవ్ సైన్స్ తెలియజేసింది. ఈ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనబోదని మానవాళి భద్రతకి ఎలాంటి ముప్పు కలగదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

నాసా నిర్దేశించిన ప్రకారం భూగోళానికి 19.3 కోట్ల కిలోమీటర్లు చేరువగా వచ్చిన భూగోళ వస్తువులను భూమికి సమీపంగా వచ్చిన వస్తువులుగా పరిగణిస్తారు. 75 లక్షల కిలోమీటర్ల కు దగ్గరగా వచ్చే వస్తువులను ప్రమాదకరమైనవిగా భావిస్తారు.

LATEST UPDATE : 

Cm Revanth : రుణమాఫీ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

Apprenticeship : సింగరేణిలో అప్రెంటిషిప్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..! 

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

మరిన్ని వార్తలు