బీఆర్ఎస్ కు భారీ షాక్.. పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

మండలం లోని మంగాపురంతండా లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కి చెందిన ఎంపీటీసీ తేజావత్ అరుణ తో రాజారాంపేట సోసైటీ వైస్ చైర్మన్ ధీరావత్ బాలాజీ, పంచాయతీ వార్డు సభ్యులు శ్యామిలీ, భారతి లతో పాటు బీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు తేజావత్ కోటేశ్వరరావు. గోబ్రియా. వీరన్న, వంశీ, మరియు అనేక మంది బీఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు.

బీఆర్ఎస్ కు భారీ షాక్.. పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

నేలకొండపల్లి, మన సాక్షి :

మండలం లోని మంగాపురంతండా లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కి చెందిన ఎంపీటీసీ తేజావత్ అరుణ తో రాజారాంపేట సోసైటీ వైస్ చైర్మన్ ధీరావత్ బాలాజీ, పంచాయతీ వార్డు సభ్యులు శ్యామిలీ, భారతి లతో పాటు బీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు తేజావత్ కోటేశ్వరరావు. గోబ్రియా. వీరన్న, వంశీ, మరియు అనేక మంది బీఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు.

అనంతరం టీపీసీసీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా అహ్వనించారు. మంగాపురంతండా లో బీఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది. పార్టీలో చేరిన వారికి పార్టీ అండగాఉంటుందని శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. కాగా ఎంపీటీసీ అరుణ తన అనుచరులతో భారీ ఎత్తున మంగాపురంలో శ్రీనివాసరెడ్డి సమక్షంలో జరిగే సభలో కాంగ్రెస్ లో చేరుతారని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు ధీరావత్ కోటేశ్వరరావు, నెల్లూరి భద్రయ్య, కోడాలి గోవిందరావు, సీత్యా, బాలాజీ, వెన్నపూసల సీతారాములు, కుక్కల హనుమంతరావు, యడవల్లి సైదులు తదితరులు
పాల్గొన్నారు.

ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!