మిర్యాలగూడ :  కాంగ్రెస్ కు బిగ్ షాక్ .. బీఆర్ఎస్ లో చేరిన సర్పంచ్

మిర్యాలగూడ :  కాంగ్రెస్ కు బిగ్ షాక్ .. బీఆర్ఎస్ లో చేరిన సర్పంచ్

మాడ్గులపల్లి, మనసాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.  కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి ల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

 

మాడ్గులపల్లి మండల పరిధిలోని చిరుమర్తి గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీశైలం కాంగ్రెస్ పార్టీని వీడి స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు,ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మక్కెన కోటిరెడ్డి ల సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కరరావు,కోటిరెడ్డి లు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు.సర్పంచ్ తో పాటు వార్డ్ మెంబర్లు 60 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ ,మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య,వేములపల్లి పిఎసిఎస్ చైర్మన్ రాములు గౌడ్, కుక్కడం సర్పంచ్ అలుగుబెల్లి గోవిందరెడ్డి, పాములపాడు ఎంపిటిసి యాతం కళింగారెడ్డి ,పోకల రాజు, తదితరులు ఉన్నారు.