కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా శుక్రవారం మరి కొంతమంది బిజెపి బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

హైదరాబాద్ ,  మన సాక్షి :

భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా శుక్రవారం మరి కొంతమంది బిజెపి బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు.

ఢిల్లీలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మోత్కుపల్లి నరసింహులు (మాజీ మంత్రి) ,ఏనుగు రవీందర్ రెడ్డి ( మాజీ ఎమ్మెల్యే) ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యా సాగర్ , సంతోష్ కుమార్, కపిలవాయి దిలీప్ కుమార్ , నీలం మధు నాయకుడు (పటాన్ చెరు), జి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పార్టీలో చేరిన వారితో చేసి వేణుగోపాల్ తో పాటు మరికొందరు పెద్దలు భేటీ అయ్యారు.

ALSO READ : మాడుగులపల్లి : రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయిన ట్రాక్టర్.. పల్నాడు ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం