మాడుగులపల్లి : రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయిన ట్రాక్టర్.. పల్నాడు ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం

మాడుగులపల్లి : రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోయిన ట్రాక్టర్.. పల్నాడు ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం

మాడుగులపల్లి, మన సాక్షి

కుక్కడం రైల్వే స్టేషన్లో ఆర్థ గంటసేపు ఆగిన పల్నాడు ఎక్స్ ప్రెస్. వివరాలలోకి వెళితే నల్గొండ జిల్లా, మాడుగుల పల్లి మండలం మాడుగులపల్లికి చెందిన చెన్నయ కట్టెలబట్టికి కట్టెలు తీసుకొని వెళ్తుండగా
కుక్కడం, మాడుగులపల్లి మధ్య చెర్వు పల్లి వెళ్లే మార్గం లో ట్రాక్టర్ రైలు పట్టాలు దాటుతుండగా మధ్య లో ఇరుక్కుపోయినది.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలసులకు సమాచారం ఇవ్వడంతో అదే సమయంలో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పల్నాడు ఎక్స్ప్రెస్ ను కుక్కడం స్టేషన్ లో నిలిపివేసిన రైల్వే అధికారులు.
అనంతరం జెసిబి సహాయంతో ట్రాక్టర్ ను తొలగించడంతో హైదరాబాద్ బయలుదేరిన పల్నాడు ఎక్స్ప్రెస్.