తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : వ్యవసాయ, రెవెన్యూ అధికారుల జాయింట్ సర్వే.. రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు..!

Miryalaguda : వ్యవసాయ, రెవెన్యూ అధికారుల జాయింట్ సర్వే.. రైతు భరోసా కు అనర్హుల గుర్తింపు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

రైతు భరోసా లబ్ధిదారుల ఎంపికలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అన్నారం, జప్తివీరప్పగూడ, ఆలగడప, హైదలాపురం, తడకమల్ల, తక్కెళ్ళపహాడ్, గూడూరు, కిష్టాపురం నందిపహాడ్ గ్రామాల్లో సాగు భూమి వివరాలు సేకరించారు.

సాగుకు యోగ్యం కానీ భూముల వివరాలు రెవిన్యూ శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో 5 బృందాలుగా ఏర్పడి రైతు భరోసా సర్వే నిర్వహించడం జరుగుతుంది. సర్వేలో తహసిల్దార్ హరిబాబు, మిర్యాలగూడ మండల వ్యవసాయ అధికారి సైదా నాయక్, ఆర్ ఐ లు రామకృష్ణ సత్యనారాయణ, ఏ ఈ ఓ లు షఫీ రమ్య, అఫ్రీన్, గోపి, రమేష్, మృదుల పాల్గొన్నారు.

| MOST READ : 

మరిన్ని వార్తలు