తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Nalgonda : కేసీఆర్.. నేను దెబ్బ కొడితే ఏక్కడ ఉంటావో తెలుసుకో.. మంత్రి కోమటిరెడ్డి పంచ్..!

Nalgonda : కేసీఆర్.. నేను దెబ్బ కొడితే ఏక్కడ ఉంటావో తెలుసుకో.. మంత్రి కోమటిరెడ్డి పంచ్..! 

నల్లగొండ, మనసాక్షి:

మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఫిబ్రవరి లో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వస్తే తన తడాఖా చూయిస్తానని మంత్రి మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కెసిఆర్ నేను బయటకు వస్తే దెబ్బ మామూలుగా ఉండదని మాట్లాడడాన్ని ఆయన వ్యంగ్యంగా సమాధానం ఇస్తూ తాను కేసీఆర్ ను  దెబ్బ కొడితే ఏక్కడ ఉంటాడో తెలుసుకోవాలన్నారు.

దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, మైనార్టీల 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, దళితులకు మూడెకరాలు ఇస్తామని, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 10 సంవత్సరాలు పాలించి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వీటన్నిటిపై అసెంబ్లీలో నిలదీస్తానని అన్నారు. కేసీఆర్ ఆయన కొడుకు బిడ్డ అల్లుడు దోచుకుని దాచుకున్నారని వారందరూ మీద ఇడి ఎంక్వయిరీ జరుగుతుందని వారందరు జైలుకు వెళ్ళక తప్పదన్నారు.

కేసీఆర్ వలన తెలంగాణ రాష్ట్రం రాలేదని శ్రీకాంత్ చారి ఆత్మహతి కాంగ్రెస్ ఎంపీల పోరాటం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమం వలన తెలంగాణ వచ్చిందన్నారు నల్గొండ లో 970 ఇండ్లు కట్టి ఒక్కరికి ఇవ్వలేదని దీంతో అవి పాడైపోవడంతో నాలుగు కోట్లతో మరమ్మతులు జరిపించి పేదవాళ్లకు పంచుతున్నామన్నారు. అలాగే 3500 ఇండ్లు మంజూరు చేసి నిర్మిస్తున్నామన్నారు.

కెసిఆర్ పని అయిపోయిందని గత ఎంపీ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్లు రాలేదని మళ్లీ స్థానిక సంస్థలలో కాంగ్రెస్ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.10 సంవత్సరాలలో ఎస్ఎల్బీసీ సురంగని పూర్తి చేయలేదని తాను మంత్రి అయిన తర్వాత అమెరికా వెళ్లి మిషన్ తెచ్చి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఐదుగురు జడ్జిల ఫోన్ క్యాపింగ్ చేశామని ఆరోపిస్తున్నారని అసెంబ్లీలోనే దీనిపై తెలుస్తామన్నారు. దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలన్నారు. ప్రతి నెల మొదటి తారీకున ఉద్యోగుల జీతాలు ఇస్తూ ఏడు లక్షల కోట్ల రుణాలకు వడ్డీలు కడుతూ రెండు లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు.

సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గుమ్ముల మోహన్ రెడ్డి అప్పగోని రమేష్ కౌన్సిలర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు భారీ షాక్.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్.. మీకు తెలుసా..!

  2. Kcr : నేను కొడితే మామూలుగా ఉండదు.. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..!

  3. Gold Price : మహిళలకు భారీ షాక్.. రూ.13100 పెరిగిన పసిడి ధర..!

  4. Kumbh Mela Monalisa : కుంభమేళ మోనాలిసాకు వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం..!

  5. ACB : లంచం తీసుకుంటూ ఎసిబి కి పట్టుబడిన ఎస్సై..!

మరిన్ని వార్తలు