BREAKING : కెసిఆర్ కు తీవ్ర అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చికిత్స..!

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

BREAKING : కెసిఆర్ కు తీవ్ర అస్వస్థత.. యశోద ఆసుపత్రిలో చికిత్స..!

మన సాక్షి : వెబ్ డెస్క్ :

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గురువారం అర్ధరాత్రి సమయంలో ఫామ్ హౌస్ లో బాత్రూంలో కాలుజారి పడిపోయినట్లు తెలిసింది.

కుటుంబ సభ్యులు గమనించి హైదరాబాదులోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. కాగా వైద్యులు పరీక్షించి తుంటి ఎముక విరిగిపోయినట్లు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ALSO READ : ఆరు గ్యారెంటీలపై రేవంత్ తొలి సంతకం.. మాట నిలుపుకొని దివ్యాంగురాలుకు ఉద్యోగం..!