Breaking Newsతెలంగాణరాజకీయంవైద్యంహైదరాబాద్

KCR : స్నేహితుడికి కెసిఆర్ వీడ్కోలు.. భావోద్వేగం, బంగారు గొలుసు బహుకరణ..!

KCR : స్నేహితుడికి కెసిఆర్ వీడ్కోలు.. భావోద్వేగం, బంగారు గొలుసు బహుకరణ..!

మన సాక్షి, హైదరాబాద్ :

కష్టసుఖాల్లో వెన్నంటి ఉండి ఉద్యమ కాలంలో వెన్ను దన్నుగా ఉన్న స్నేహితుడికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీడ్కోలు పలికారు. వీడ్కోలు సందర్భంగా భావోద్వేగం తో కంటనీరు పెట్టారు. తన స్నేహితుడికి బంగారు గొలుసు బహుకరించారు. ప్రేమతో మీ కేసీఆర్ (విత్ లవ్ ఫ్రమ్ కెసిఆర్) అనే లాకెట్ బహుకరించారు.

బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ను కుటుంబ సభ్యులతో సహా కలిశారు. తన సతీమణి శోభతో కలిసి శ్రీనివాస్ రెడ్డి కుటుంబంతో కెసిఆర్ మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డి కొన్ని కారణాల వల్ల అమెరికాలోనే ఉండేందుకు ఆయన నిర్ణయించుకొని వెళ్తున్నారు. దాంతో కెసిఆర్ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ రెడ్డిని ఆత్మీయ వీడ్కోలు పలికారు. దగ్గరుండి కారు వద్దకు వచ్చి వీడ్కోలు పలికారు.

అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇది నాకు జరిగిన సత్కారమే కాదు నాలాంటి ఎందరో తెలంగాణ వాదులకు జరిగిన సత్కారం అన్నారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డను వదిలి వెళుతున్నందుకు చాలా బాధగా ఉందని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు