Runamafi : రుణమాఫీ పై లేటెస్ట్ అప్డేట్.. రూ. 3వేల కోట్లు రిలీజ్..!
Runamafi : రుణమాఫీ పై లేటెస్ట్ అప్డేట్.. రూ. 3వేల కోట్లు రిలీజ్..!
రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్, మనసాక్షి :
రైతు రుణమాఫీ పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు రుణమాఫీ కానీ రైతులకు త్వరలో ఎదురు విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. త్వరలో పాలమూరు జిల్లాల్లో జరిగే రైతు పండుగను పురస్కరించుకొని వివిధ కారణాల చేత రుణమాఫీ అందని రైతాంగానికి 3,000 కోట్ల రూపాయలను పంపిణీ చేయబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.
మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా బాబర్ అలీ ఖాన్, మార్కెట్ డైరెక్టర్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ… పదేళ్లలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు గత ప్రభుత్వం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆ హక్కులకు వడ్డీలు చెల్లిస్తూ, మరోవైపు పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
ఎక్కడ లేని విధంగా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 47 వేల కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రంగారెడ్డి జిల్లాలో కోహిడ వద్ద రూ.1000 కోట్లతో నిర్మించనున్న మోడల్ మార్కెట్ ఎంతో ప్రయోజన పథకంగా ఉంటుందని అన్నారు.
వ్యవసాయ బడ్జెట్ కేటాయింపుల్లో 25 వేల కోట్లు వచ్చాయని ఇందులో రైతులకు సంబంధించి 7600 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని మంత్రి అన్నారు. రాహుల్ గాంధీ సూచన మేరకు రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని, ఇతర కారణాలతో ఆగిపోయిన రైతు రుణమాఫీలకు సంబంధించి త్వరలో పాలమూరులో జరగనున్న రైతు పండుగ కార్యక్రమం ద్వారా 3000 కోట్ల రూపాయలను మిగిలిన రైతాంగానికి రుణమాఫీ ద్వారా చెల్లించడం జరుగుతుందని అన్నారు.
వరి దిగుబడి రాష్ట్రంలో ఆశాజనకంగా ఉందని అన్నారు. 66 లక్షల ఎకరాల సేద్యం తెలంగాణలో జరిగిందని, ఇందులో 46 నుండి 50 లక్షల ఎకరాల మేరకు పంట రైతుల చేతికి వచ్చిందని, మిగిలిన ధాన్యం కూడా త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని అన్నారు. 153 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి ఉందని ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని రైతులకు మంచి బోనస్ కూడా ఇస్తుందని అన్నారు. తెలంగాణ బియ్యానికి విదేశాలు మంచి మార్కెట్ ఉందని, మలేషియా, పిలిపిన్స్ దేశాల్లో తెలంగాణ బియ్యాన్ని వారు డిమాండ్ చేస్తున్నారని దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుందని అన్నారు.
MOST READ :









