TOP STORIESBreaking Newsజాతీయం

UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల్లో కీలక మార్పులు..!

UPI : ఫోన్ పే, గూగుల్ పే లావాదేవీల్లో కీలక మార్పులు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

అన్ని రకాల పేమెంట్స్ ఎక్కువ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. చిన్న అమౌంట్ నుంచి లక్షల్లో కూడా యూపీఐ ద్వారానే లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో యూపీఐ పేమెంట్స్ పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలకమైన ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు పేమెంట్స్ 30 సెకండ్లలో పూర్తయ్యేది. కాగా ఆ టైమును కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై యూపీఐ పేమెంట్స్ లావాదేవీలన్నీ వేగవంతంగా జరగనున్నాయి.

జూన్ 16వ తేదీ నుంచి దేశంలోని అన్ని రకాల యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు పేమెంట్స్ కేవలం 15 సెకండ్లలో మాత్రమే పూర్తయ్యేలా మార్పులు చేశారు. దాంతోపాటు లావాదేవీల స్టేటస్, రివర్స్, అడ్రస్ వాలిడేషన్ టైం కూడా 30 సెకండ్ల నుంచి 10 సెకండ్లకు తగ్గనున్నది.

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సర్వీస్ ప్రొవైడర్లకు జూన్ 16వ తేదీ నుంచి రెస్పాన్స్ టైం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు NPCI సర్కులర్ జారీ చేసింది. రెస్పాన్స్ టైం అంటే మనం చేసిన ట్రాన్సాక్షన్ పూర్తి కావడానికి పట్టే సమయం. ఇకపై ఈ రెస్పాన్స్ టైం 50% తగ్గనున్నది. అయితే యూజర్స్ ఎక్స్పీరియన్స్ ను మెరుగుపరిచేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు ఎన్పీసీఐ ఉత్తర్వులలో పేర్కొన్నది.

Similar News : 

  1. UPI : యూపీఐ చెల్లింపుల్లో నయా మోసం.. క్షణాల్లో ఖాతా ఖాళీ..!

  2. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!

  4. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

  5. Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!

మరిన్ని వార్తలు